స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -68 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో కృష్ణకి మురారి మీద డౌట్ వస్తుంది. ముకుంద ఎందుకు వచ్చింది అని ప్రశ్నలు వేస్తునే ఉండడంతో కృష్ణ సమాధానం చెప్పలేకపోతుంటాడు. నేను పిలిచినా రాననే చెప్పింది కానీ వాళ్ళ అమ్మ నాన్న నచ్చచెప్పి పంపిచారని ముకుంద చెప్తాడు. సరే అయితే ముకుంద ఏమైనా కండిషన్ పెడితే అది తప్పకుండా చెయ్యండి లేదంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అని కృష్ణ చెప్తుంది. ముకుంద చెప్పిన కండిషన్ చెబితే నువ్వు ఏమైపోతావో కృష్ణ అని మనసులో ఆలోచించుకుంటూ మురారి పడుకుండిపోతాడు.
మరోవైపు మురారి గురించి ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. మురారి నన్ను తీసుకొచ్చింది నా మీద ప్రేమ తో కాదా? కృష్ణ చెపితే తీసుకొచ్చాడా? అంటూ కోపంతో.. మురారిని 'గార్డెన్ కి రా 'అని మెసేజ్ చేస్తుంది. మురారి నిద్ర పోవడంతో ఆ మెసేజ్ చూసుకోలేకపోతాడు. దాంతో ముకుంద కోపంతో రగిలిపోతుంది.
మరోవైపు ముకుంద గురించి ఆలోచిస్తూ రేవతి టెన్షన్ పడుతుంది. నిద్ర పట్టక భవాని దగ్గరికి వెళ్లి.. మనం ఇప్పుడు ముకుందని తీసుకురావడం కరెక్ట్ కాదక్కా.. ఒక వైపు పెళ్ళైన జంట గదిలో ఉండగా, అవతలివైపు ముకుంద గదిలో ఒంటరిగా ఉండటం బాగోలేదని చెప్తుంది. దానికి భవానీ నాక్కూడా అలాగే అనిపిస్తుందని అంటుంది. మరి ఏం చేద్దామని భవానీ అడుగుతుంది. వీలైనoత త్వరగా ఆదర్శ్ ను ఇంటికి వచ్చేలా చెయ్యాలని చెప్తుంది. నేను అదే పనిలో ఉన్నాను రేవతి అని భవానీ చెప్తుంది. అయితే వీళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్ని ముకుంద వింటుంది. రేవతి అత్తయ్య ఇలా మాట్లాడుతుందేంటి.. నాకు మురారి అంటే ఇష్టమని తెలిసిపోయిందా ఏంటి? ఎలాగైనా వీళ్ళకి డౌట్ రాకుండా మురారిని సొంతం చేసుకోవాలని ముకుంద ఆలోచిస్తుంటుంది.
మురారి స్టేషన్ కి కార్ లో వెళ్తుంటే.. కార్ వెనకాల సీట్ లో ఉన్న ముకుంద అద్దంలోకి చూస్తూ గుడ్ మార్నింగ్ అని అనడంతో మురారి షాక్ అవుతాడు. కార్ ఒక్కసారిగా ఆపి.. నువ్వేంటి ఇక్కడ, దిగు ముందు. ఎవరైనా చూస్తారు అంటూ టెన్షన్ పడుతాడు. "లేదు నేను స్టేషన్ లో కంప్లేంట్ ఇవ్వాలి. నా ప్రేమ మిస్ అయింది. మిస్సింగ్ కేసు పెట్టాలి. నన్ను ఒకరు చీట్ చేసారు. నా మీద ప్రేమతో నా పుట్టింటి నుండి తీసుకొచ్చారని అనుకున్నా.. కానీ తన భార్య తీసుకురమ్మంటే తీసుకొచ్చారు" అని ముకుంద అంటుంది. అలా అనగానే ఎవరైనా చూస్తారేమో అని మురారి కంగారు పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.